Ap Bima Sakhi Yojana: ఏపీ మహిళలకు నెలకు రూ.7వేలు ప్రోత్సాహకం – బీమా సఖి పథకం పూర్తి వివరాలు

WhatsApp Group Join Now

ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్ 🌸 – నెలకు రూ.7,000 ప్రోత్సాహకం! | Ap Bima Sakhi Yojana 7000 Monthly Benefit

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు కొత్త పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఇప్పుడు గ్రామీణ మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు బీమా సఖి యోజనను ప్రారంభించింది.

డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూత
గ్రామీణ ప్రాంత మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఎల్ఐసి తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంపికైన మహిళలకు బీమా అవగాహన కల్పించే శిక్షణ ఇవ్వబడుతుంది. వీరు గ్రామాల్లో ప్రజలకు బీమా వివరాలు చెప్పే ‘బీమా సఖి’లుగా పనిచేస్తారు.

ఎంపిక & శిక్షణ వివరాలు
జిల్లా స్థాయిలో ఏపీఎం, డిపిఎం లు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారు. ఐఆర్డిఏ మార్గదర్శకాల ప్రకారం డ్వాక్రా మహిళలను ఎంపిక చేసి, ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్లు అందజేసి, అధికారికంగా నియమిస్తారు.

Pravasandhra Bharosa
Pravasandhra Bharosa: రూ 10 లక్షల భీమా, ఏపీ ప్రభుత్వం మరో పథకం- అర్హతలు..!!

ప్రోత్సాహకాలు & బోనస్

  • మొదటి సంవత్సరం: నెలకు రూ.7,000
  • రెండో సంవత్సరం: నెలకు రూ.6,000
  • మూడో సంవత్సరం నుంచి: నెలకు రూ.5,000
    అదనంగా బోనస్, కమిషన్ కూడా లభిస్తుంది. వీరు ఎల్ఐసి ఉద్యోగులుగా కాకుండా కెరీర్ ఏజెంట్లుగా మాత్రమే పరిగణించబడతారు.

ఎవరికి అర్హత?

  • వయస్సు: 18–70 సంవత్సరాలు
  • కనీస విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
  • డ్వాక్రా మహిళలు మాత్రమే
  • ఇప్పటికే ఎల్ఐసి ఏజెంట్లు, ఎల్ఐసి ఉద్యోగుల కుటుంబ సభ్యులు, వ్యాపారస్తులు లేదా ఉపాధి పొందుతున్న వారు అనర్హులు

దరఖాస్తు ఎలా?
ఈ పథకంపై ఆసక్తి ఉన్న డ్వాక్రా మహిళలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఎలాంటి ఉపాధి పొందని మహిళలకు ఇది బంగారు అవకాశం.

AP 10th Public Exams 2026
AP 10th Public Exams 2026: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు – ఫీజు చెల్లింపులపై తాజా అప్డేట్

👉 గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ బీమా సఖి పథకం పెద్ద మార్పు తీసుకురానుంది.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

WhatsApp Group Join Now
error: Content is protected !!
WhatsApp