మీ ఆధార్‌తో లింక్ అయిన సిమ్ కార్డులు ఇలా చెక్ చేయండి – సంచార్ సాథి పూర్తి గైడ్ | SIM Card Linked to Aadhaar Check
SIM Card Linked to Aadhaar: మీ ఆధార్‌కి ఎన్ని సిమ్‌లు లింక్ అయ్యాయో చెక్ చేయడం చాలా ముఖ్యం. recharge ధరలు తక్కువగా ఉన్నప్పుడు చాలా మంది రెండు, మూడు సిమ్ కార్డులు తీసుకున్నారు. కానీ రీఛార్జ్ రేట్లు పెరగడంతో ఒకటి లేదా రెండు సిమ్‌లను మాత్రమే వాడుతున్నారు. మీరు వాడని సిమ్‌లు ఇంకా యాక్టివ్‌గా ఉండి ఉండొచ్చు. ఇవి మోసాలకు వాడే ప్రమాదం ఉంది.
ఈ సమస్యను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం సంచార్ సాథి పోర్టల్ అనే సర్వీస్‌ను అందిస్తోంది. దీని ద్వారా మీ ఆధార్‌పై ఎన్ని మొబైల్ నంబర్లు ఉన్నాయో చెక్ చేయవచ్చు. మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డులు తెలిసి ఉంటే మోసాలను నివారించవచ్చు.
ఈ పోర్టల్ రెండు ముఖ్యమైన ఫీచర్లు అందిస్తుంది:
1️⃣ Telecom Analytics for Fraud Management and Consumer Protection (TAF-COP): ఇది మీ ఆధార్‌తో లింక్ అయిన అన్ని మొబైల్ నంబర్లను చూపిస్తుంది. మీకు తెలియని నంబర్లు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయవచ్చు.
2️⃣ Central Equipment Identity Register (CEIR): మీ ఫోన్ పోయినప్పుడు దాన్ని ట్రాక్ చేయడానికీ, అవసరమైతే బ్లాక్ చేయడానికీ ఇది ఉపయోగపడుతుంది.
ఇలా చెక్ చేయండి
- ముందుగా 👉 https://sancharsaathi.gov.in ఓపెన్ చేయండి.
- Know Your Mobile Connections ఆప్షన్‌పై క్లిక్ చేయండి. లేదా నేరుగా 👉 https://tafcop.sancharsaathi.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- మీ యాక్టివ్ మొబైల్ నంబర్ టైప్ చేసి, వచ్చిన OTPని వెరిఫై చేయండి.
- వెరిఫికేషన్ పూర్తయ్యాక, మీ ఆధార్‌తో లింక్ అయిన అన్ని మొబైల్ నంబర్లు కనిపిస్తాయి.
- మీకు తెలియని నంబర్లు ఉంటే “ఇది నాది కాదు” అనే ఆప్షన్‌ను ఎంచుకుని రిపోర్ట్ చేయండి. ఆ తర్వాత టెలికాం కంపెనీ వాటిని చెక్ చేసి అవసరమైతే డీయాక్టివేట్ చేస్తుంది.
జాగ్రత్తలు
- ఆధార్, పాన్ కార్డు వంటి వ్యక్తిగత డాక్యుమెంట్లను ఎవరికి అయినా ఇవ్వకండి.
- ఎక్కడైనా మొబైల్ వెరిఫికేషన్ అవసరమైతే జాగ్రత్తగా చెక్ చేయండి.
- సంచార్ సాథి పోర్టల్‌ను రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండండి.
- ఒక వ్యక్తికి గరిష్టంగా 9 సిమ్‌లు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది (జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఇది 6కి పరిమితం).
మోసం అనిపిస్తే 👉 https://cybercrime.gov.inలో కంప్లైంట్ ఇవ్వండి లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయండి. ఇలా చేస్తే మీ పేరు మీద తీసుకున్న నకిలీ సిమ్‌లను సులభంగా ఆపగలుగుతారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.