Ap Women Loan Scheme: ఏపీలో మహిళలకు సూపర్ న్యూాస్.. రూ.10వేల నుంచి రూ.2 లక్షలు వరకు ఇస్తారు

WhatsApp Group Join Now

ఏపీలో మహిళలకు భారీ గుడ్ న్యూస్: రూ.10 వేల నుండి రూ.2 లక్షల వరకు రుణాలు | Ap Women Loan Scheme

రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామిక రంగంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబంలో కనీసం ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ దిశగా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల (SHGs) మహిళలకు మరియు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఆర్థిక సాయం అందిస్తోంది.

మహిళల యూనిట్ల విస్తరణకు రూ.10 వేల నుండి రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. స్త్రీనిధి పథకం కింద రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు సహాయం లభిస్తుంది. SC/ST ఉన్నతి పథకం కింద రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు, అవసరమైతే రూ.10 లక్షల వరకు కూడా సాయం అందించనున్నారు.

Ration Shops
Ration Shops: ఇక రోజంతా రేషన్‌ సరఫరా

ప్రభుత్వం డెయిరీ యూనిట్లు, కలంకారి వస్త్రాలు, ఆహార శుద్ధి యూనిట్లు, పచ్చళ్లు, పేపర్ ప్లేట్స్, దినుసుల పొడులు, ఫ్యాన్సీ షాపులు, హోటళ్లు, టీ-షర్ట్ తయారీ వంటి చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. యూనిట్ ఏర్పాటు చేసిన మహిళ కనీసం ఒకరికి ఉద్యోగం కల్పించాలి. DRDA (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ) అధికారులు సర్వే ద్వారా యూనిట్లను గుర్తించి సహాయం చేస్తారు. యూనిట్లను జీవనోపాధి యూనిట్లు, ఎంటర్‌ప్రెన్యూర్ యూనిట్లు, ఎంటర్‌ప్రైజెస్ యూనిట్లు గా వర్గీకరిస్తారు.

మహిళలకు మార్కెటింగ్ మరియు వ్యాపార విస్తరణలో సహాయం అందించనున్నారు. పరిశ్రమల వివరాలు, ఫోటోలు, వీడియోలను యాప్ ద్వారా అప్‌లోడ్ చేసి ధృవీకరణ జరుగుతుంది. ఆసక్తి ఉన్న మహిళలు DRDA అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

Ap Bima Sakhi Yojana 7000 Monthly Benefit
Ap Bima Sakhi Yojana: ఏపీ మహిళలకు నెలకు రూ.7వేలు ప్రోత్సాహకం – బీమా సఖి పథకం పూర్తి వివరాలు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ కీలకపాత్ర పోషించనుంది. దీని ద్వారా వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన లభించనుంది.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

WhatsApp Group Join Now
WhatsApp