ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. మీ కార్డు ఎక్కడుందో ఇలా చెక్ చేసుకోండి | AP Smart Ration Card 2025
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని వేగవంతం చేసింది. ఇప్పటికే ఎక్కువ జిల్లాల్లో కార్డులు లబ్ధిదారులకు అందజేయబడ్డాయి. అయితే ఇంకా చాలా మంది తమ కార్డు ఎక్కడ ఉందో తెలియక అయోమయంలో ఉన్నారు.
అధికారుల సమాచారం ప్రకారం, పాత రేషన్ కార్డు నంబర్ లేదా రేషన్ కార్డు వివరాలు ఎంటర్ చేస్తే మీ స్మార్ట్ కార్డు ఏ డిపో లేదా సచివాలయంలో ఉందో ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. సంబంధిత కేంద్రానికి వెళ్లి కార్డును పొందే అవకాశం ఉంటుంది.
ప్రత్యేకత ఏమిటంటే, ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి. వీటిపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే రేషన్ పొందిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. అలాగే పోర్టబులిటీ సౌకర్యం ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక పంపిణీ సమయంలో కొన్ని కార్డుల్లో చిన్న తప్పులు నమోదైనట్టు సమాచారం. అయితే వీటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. సంబంధిత సచివాలయాన్ని సంప్రదించి తప్పులను సరిచేసుకోవచ్చని సూచించారు. రేషన్ పంపిణీకి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 ద్వారా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.