ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఇంటికే డెలివరీ! | AP New Smart Ration Card 2025
రేషన్ షాపు వద్ద లైన్లు ఇక ముగిసినట్టే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రేషన్ కార్డు కోసం రేషన్ షాపుల వద్దకు వెళ్లి పొందాల్సి వచ్చేది. కానీ ఇకపై QR కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులు నేరుగా మీ ఇంటికే అందజేస్తారు.
ముఖ్యాంశాలు:
- ✅ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మీ ఇంటికే వస్తుంది
- ✅ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు డెలివరీ చేస్తారు
- ✅ బయోమెట్రిక్ / ఆధార్ OTP ద్వారా వెరిఫికేషన్ తప్పనిసరి
- ✅ ఇకపై నెల మొత్తం రేషన్ తీసుకోవచ్చు
- ✅ వచ్చే నెల నుంచి గోధుమ పిండి కూడా రేషన్లో లభ్యం
రేషన్ కార్డు ఎవరొస్తారు?
ఈ ప్రక్రియను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహిస్తారు. రేషన్ పంపిణీ దుకాణాల డీలర్ల సహకారంతో కార్డులు మీ ఇంటికే అందజేస్తారు. కార్డు అందజేసే సమయంలో ఉద్యోగులు ఫింగర్ ప్రింట్ / ముఖ గుర్తింపు / ఐరిష్ / ఆధార్ OTP ద్వారా ధృవీకరణ చేసి, ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
మీ ప్రాంత సిబ్బంది వివరాలు తెలుసుకోవడం ఇలా:
1️⃣ మీ జిల్లా ఎంచుకోండి
2️⃣ మీ మండలం సellect చేయండి
3️⃣ మీ సచివాలయం ఎంపిక చేసుకోండి
4️⃣ మీ రేషన్ షాప్ నెంబర్ ఎంటర్ చేయండి
👉 అప్పుడు మీ రేషన్ షాప్‌కు సంబంధించిన సచివాలయం ఉద్యోగి వివరాలు కనిపిస్తాయి.
🔗 వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కొత్త మార్పులు:
ఇప్పటివరకు రేషన్ తీసుకోవడానికి నెలలో 1-15 తేదీలలో మాత్రమే అవకాశం ఉండేది. ఇకపై ప్రభుత్వం ఆ గడువును రద్దు చేసింది. ఇప్పటినుంచి నెల మొత్తం రేషన్ షాపులు తెరిచి ఉంటాయి. ప్రజలు తమ సౌకర్యం ప్రకారం ఎప్పుడైనా సరుకులు పొందవచ్చు.
📢 అంతేకాకుండా, వచ్చే నెల నుంచి బియ్యం, చక్కెరతో పాటు గోధుమ పిండి కూడా రేషన్లో ఇవ్వనున్నారు.