ఏపీ ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ నిధులు – AP MGNREGA Payments
ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీగా నిధులు విడుదల చేసింది. మొత్తం ₹1,668 కోట్లు కేటాయించడంతో మే 15 నుంచి ఆగస్టు 15 వరకు ఉన్న వేతన బకాయిలను కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో వేలాది కుటుంబాలకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. అధికారులు మరో ₹137 కోట్లు కూడా త్వరలో విడుదలవుతాయని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే వేతన బకాయిలు కార్మికుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా EESL (కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. పర్యాటక ప్రదేశాలు, హైవేలు, ప్రధాన నగరాల్లో EV ఛార్జింగ్ సెంటర్లు, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. LED లైట్లు, సౌర శక్తి వినియోగాన్ని పెంపొందించడంతో పాటు ప్రజా రవాణాలో EV వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించనున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు అందించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం.
ఇక ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షలు జరిగాయి. మొత్తం 1,07,969 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 97,038 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 17,824 మంది దరఖాస్తు చేయగా, 15,412 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.
అదే సమయంలో విజయవాడలో భారతీయ హస్తకళల ప్రదర్శన సెప్టెంబర్ 8 నుంచి 14 వరకు జరగనుంది. గాంధీ శిల్ప్ బజార్, లేపాక్షి హస్తకళల డిజైన్ పోటీ వంటి కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. హస్తకళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించనుండగా, ప్రజలకు చేతితో చేసిన వస్తువుల ప్రాధాన్యం తెలియజేయనున్నారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధికి ఈ ప్రదర్శన దోహదపడనుంది.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.