AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల | ఎంపికైన అభ్యర్థుల వివరాలు

WhatsApp Group Join Now

ఏపీ మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల – ఎంపికైన అభ్యర్థుల వివరాలు అందుబాటులో | Ap Mega Dsc Final Selection List 2025

అమరావతి: రాష్ట్ర విద్యాశాఖ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC) తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక మెగా డీఎస్సీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అదేవిధంగా జిల్లా కలెక్టరేట్‌లు, జిల్లా విద్యాశాఖాధికారుల (DEO) కార్యాలయాల్లో కూడా జాబితాను అందుబాటులో ఉంచనున్నారు.

ఈసారి మెగా డీఎస్సీ కింద మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20న నోటిఫికేషన్ వెలువడింది. భారీగా స్పందించిన అభ్యర్థులు 3,36,300 మంది కాగా, సమర్పించిన దరఖాస్తుల సంఖ్య 5,77,675. జూన్ 6 నుంచి జూలై 2 వరకు ఆన్‌లైన్ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించారు. అనంతరం జూలై 5న ప్రాథమిక కీ, ఆగస్టు 1న తుది కీ ప్రకటించారు.

Pravasandhra Bharosa
Pravasandhra Bharosa: రూ 10 లక్షల భీమా, ఏపీ ప్రభుత్వం మరో పథకం- అర్హతలు..!!

తుది ఎంపికలో TET‌కు 20% వెయిటేజీ ఇచ్చారు. మొత్తం ఏడు విడతలుగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయబడింది. చివరగా ఎంపికైన వారి జాబితాను ఈరోజు విడుదల చేశారు.

ఎంపిక జాబితా చూసేందుకు:
✔️ మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
✔️ జిల్లా వారీగా లేదా అభ్యర్థి వివరాలతో మీ ఫలితాలను పరిశీలించండి

AP 10th Public Exams 2026
AP 10th Public Exams 2026: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు – ఫీజు చెల్లింపులపై తాజా అప్డేట్

ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉపాధి అవకాశాలను పొందబోతున్నారు.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

WhatsApp Group Join Now
error: Content is protected !!
WhatsApp