ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త – యూరియా వినియోగం తగ్గిస్తే బహుమతి | AP Government Farmers Scheme 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు మంచి వార్త చెప్పారు. యూరియా వినియోగాన్ని తగ్గించే రైతులకు ప్రోత్సాహకంగా ప్రతి యూరియా బస్తాకు రూ.800 నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఉదాహరణకు, ఈ ఏడాది 4 బస్తాలు వాడిన రైతు, వచ్చే ఏడాది 2 బస్తాలు మాత్రమే వాడితే మొత్తం రూ.1,600 లాభం పొందగలడు.
సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం యూరియా వినియోగం అధికంగా ఉండటం వల్ల పంట నాణ్యత తగ్గుతోందని, విదేశీ మార్కెట్లలో సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. రాబోయే సీజన్లలో యూరియా వాడకాన్ని తగ్గించి, పంటల వైవిధ్యాన్ని పెంచాలని రైతులకు సూచించారు.
రాయలసీమలో మల్టీకల్చర్, కోస్తా ప్రాంతంలో హార్టీకల్చర్కు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పశుసంపద, ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలను అభివృద్ధి చేసి రైతుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
అదే విధంగా, ఆక్వా కల్చర్ యూనిట్లకు ₹1.50కే యూనిట్ విద్యుత్ ఇవ్వాలని, యానిమల్ హాస్టల్ల నిర్మాణం చేపట్టాలని అధికారులు పేర్కొన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధి కోసం పీఎం ప్రణామ్ కింద ఇచ్చే సబ్సిడీని నేరుగా వారికి అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.
➡️ ఈ నిర్ణయం వల్ల రైతులకు నేరుగా లాభం, పంటల నాణ్యత పెరుగుదల, మరియు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి గుర్తింపు లభించనుంది.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.