ఆధార్ కొత్త యాప్: డిసెంబర్‌లో విడుదల కానున్న UIDAI మొబైల్ అప్లికేషన్ | Aadhaar New App 2025
న్యూఢిల్లీ: ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త మొబైల్ యాప్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న mAadhaar యాప్‌కు బదులుగా ఈ యాప్ డిసెంబర్ 2025లో అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు.
ఈ యాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), Face ID లాగిన్, QR కోడ్ వెరిఫికేషన్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. వినియోగదారులు ఇంటి నుంచే పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలను అప్‌డేట్ చేసుకునే వీలుంటుంది. అంతేకాకుండా e-Aadhaar డౌన్‌లోడ్ చేయడం, PVC ఆధార్ కార్డు ఆర్డర్ చేయడం, చేసిన మార్పుల స్థితి తెలుసుకోవడం కూడా ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుంది.
అయితే, మొబైల్ నంబర్ మార్పు వంటి కొన్ని కీలక సవరణలకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. అందువల్ల ఆ మార్పుల కోసం ఆధార్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లాల్సి ఉంటుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కొత్త యాప్ ప్రారంభమైతే ఆధార్ కేంద్రాల వద్ద ఉండే రద్దీ తగ్గి, సేవలు వేగంగా అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, బ్యాంకు అకౌంట్లు మరియు ప్రైవేట్ సర్వీసుల కోసం ఆధార్ ఒక కీలక గుర్తింపు పత్రం కావడంతో, ఈ యాప్ వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా మారనుంది.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.