ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త – మొబైల్లోనే ఖాతా వివరాలు | AP DWCRA Women AI App
ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మరో సదుపాయం అందిస్తోంది. ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే మొబైల్లోనే తమ ఖాతా లావాదేవీలను చెక్ చేసుకునే వీలు కల్పించనుంది. ఈ కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘మన డబ్బులు – మన లెక్కలు’ అనే AI ఆధారిత యాప్‌ను ప్రారంభించింది.
ప్రస్తుతం 260 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా నడుస్తున్న ఈ యాప్, డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 83 లక్షల మంది మహిళలకు అందుబాటులోకి రానుంది. ప్రతి ఏడాది డ్వాక్రా మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా సుమారు ₹40,000 కోట్ల వరకు రుణాలు తీసుకుంటారు. పొదుపుల ద్వారా మరో ₹20,000 కోట్లు వాడుతున్నారు. తిరిగి చెల్లింపుల రూపంలో సుమారు ₹40,000 కోట్లు వెళ్తాయి. ఇంత పెద్ద మొత్తాలు ఉన్నా, రికార్డుల్లో లోపాలు, గోల్మాల్ తరచుగా జరుగుతాయని ప్రభుత్వం గుర్తించింది.
ఈ యాప్ ద్వారా డ్వాక్రా సభ్యులు తమ బ్యాంక్ ఖాతా వివరాలు మొబైల్లోనే చూడవచ్చు. సమావేశాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. AI ఆధారిత సదుపాయంతో, నోటితో అడిగినా సరైన సమాచారం లభిస్తుంది. ఖాతాల్లో తేడాలు ఉంటే వెంటనే యాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను రాష్ట్ర స్థాయిలో వారం రోజుల్లో పరిష్కరిస్తారు.
ఈ యాప్ ద్వారా సంఘం పేరు, సభ్యుల వివరాలు, పొదుపు మొత్తం, రుణ వివరాలు, ఎన్ని వాయిదాలు చెల్లించారో ఇంకా ఎన్ని బాకీ ఉందో, ప్రతి నెల వడ్డీ వివరాలు కూడా స్పష్టంగా చూపిస్తుంది. డ్వాక్రా మహిళలకు ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకత, సులభతరం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్, చదువుకోని మహిళలకు కూడా ఉపయోగపడేలా రూపొందించారు. డిసెంబరు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని డ్వాక్రా సంఘాల మహిళలు దీని ప్రయోజనాన్ని పొందనున్నారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.