AP Farmers: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.. పత్తి ధర రూ.8,110 ఫిక్స్ – అన్నదాత సుఖీభవ పథకం
ఆంధ్రప్రదేశ్ పత్తి రైతులకు భారీ ఊరట లభించింది. 2025-26 పత్తి సీజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది. పొడవు పింజ పత్తి క్వింటాకు రూ.8,110, మధ్య పింజ పత్తి క్వింటాకు రూ.7,710గా నిర్ణయించింది. ఈ మొత్తం రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే నేరుగా జమ కానుందని ప్రభుత్వం తెలిపింది. ఈసారి కూడా Cotton Corporation of India (CCI) ద్వారానే పత్తి కొనుగోలు జరగనుంది. రైతులు తమ పంటను అమ్ముకోవాలంటే కాపాస్ కిసాన్ యాప్ ద్వారా ముందుగానే నమోదు చేసుకోవాలి. యాప్లో స్లాట్ బుకింగ్ సదుపాయం ఉండటం వల్ల సులభంగా విక్రయానికి సమయం ఎంచుకోవచ్చు.
ఈ సంవత్సరం రాష్ట్రంలో సుమారు 4.02 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరగగా, 7.12 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. రైతుల కోసం మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు ఆధార్ ఆధారిత ఈ-పంట డేటా ద్వారా రైతులను గుర్తిస్తారు. రైతులు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకుని కనీస మద్దతు ధర పొందవచ్చు. పంట అమ్మకాల కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ తప్పనిసరిగా సమర్పించాలి.
పత్తి నాణ్యతపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తేమ శాతం కొలిచే యంత్రాలు, అగ్ని నిరోధక పరికరాలు, ఎలక్ట్రానిక్ తూనికలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా టార్పాలిన్లు, బీమా సదుపాయం కూడా రైతులకు అందుబాటులోకి రానున్నాయి. పత్తి విక్రయం తర్వాత రైతుల బ్యాంక్ అకౌంట్లోనే సీసీఐ నేరుగా చెల్లింపు చేస్తుంది. రవాణా వివరాలు కూడా యాప్లో నమోదు చేసి, రవాణాదారులకు డబ్బులు నేరుగా బదిలీ కానున్నాయి.
ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు పర్యవేక్షణ జరుగుతుంది. రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంట విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2025-26 సీజన్ కోసం AP Cotton Price రూ.8,110గా నిర్ణయించడం పత్తి రైతులకు పెద్ద ఊరట కలిగిస్తోంది. రైతులు కాపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకుని, స్లాట్ బుకింగ్ చేసుకుంటే సీసీఐ ద్వారా న్యాయమైన ధరకు తమ పంటను అమ్ముకోవచ్చు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.