Ration Shops: ఇక రోజంతా రేషన్‌ సరఫరా

WhatsApp Group Join Now

రేషన్‌ దుకాణాలు మినీమాల్స్‌గా మారనున్నాయి – ఇక రోజంతా రేషన్‌ సరఫరా | Ration Shops

రేషన్‌ దుకాణాల పనితీరులో పెద్ద మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై చౌకధర దుకాణాలు రోజంతా తెరిచి ఉంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ దుకాణాలను మినీమాల్స్‌గా మార్చి, రేషన్‌తో పాటు అన్ని రకాల నిత్యావసరాలను కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ముందుగా పైలట్‌గా అమలు చేయడానికి రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ నగరాలను ఎంపిక చేశారు.

ప్రస్తుతం రేషన్‌ దుకాణాలు నెలలో 1 నుంచి 15 వరకు మాత్రమే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు పనిచేస్తున్నాయి. అయితే కొందరు డీలర్లు సమయానికి దుకాణాలు తెరవకపోవడం లేదా పూర్తిస్థాయి సేవలు అందించకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త విధానంలో రోజుకు సుమారు 12 గంటలు దుకాణాలను తెరిచి ఉంచేలా చర్యలు చేపడుతున్నారు.

AP Farmers Cotton Price 2025
AP Farmers: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.. నేరుగా రూ.8,110 అకౌంట్లలో జమ

మినీమాల్స్‌ రూపంలో పనిచేసే ఈ దుకాణాలకు జాతీయ వ్యవసాయ కో-ఆపరేటివ్‌ సొసైటీ, గిరిజన కార్పొరేషన్‌ వంటి సంస్థల నుంచి నిత్యావసరాలు సరఫరా చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే ఈ వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా డీలర్లే కొనాలా, రాయితీలు ఎలా ఉండాలి అనే అంశాలపై ఇంకా తుది నిర్ణయం రావాల్సి ఉంది.

పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక్కో నగరంలో 15 చొప్పున మొత్తం 75 దుకాణాలను ఎంపిక చేశారు. ఈ వారం లోపల ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇకపై డీలర్లు రోజంతా దుకాణాల్లో ఉండాల్సి వస్తుంది. అలాగే వారి ఆదాయం దెబ్బతినకుండా, రేషన్‌తో పాటు అన్ని నిత్యావసరాలను అందుబాటులో ఉంచే విధంగా మినీమాల్స్‌ విధానాన్ని అమలు చేయనున్నారు.

Ap Bima Sakhi Yojana 7000 Monthly Benefit
Ap Bima Sakhi Yojana: ఏపీ మహిళలకు నెలకు రూ.7వేలు ప్రోత్సాహకం – బీమా సఖి పథకం పూర్తి వివరాలు

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

WhatsApp Group Join Now
WhatsApp