అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల జమ – తేదీ ఖరారు, ఇలా చెక్ చేసుకోండి! | Annadata Sukhibhava Second Installment
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల జమ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. పీఎం కిసాన్ పథకం నిధులతో కలిపి ఏటా రైతులకు రూ.20,000 ఇవ్వాలన్న హామీ ప్రకారం, ఆగస్టు 2న తొలి విడత చెల్లింపులు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పుడు రెండో విడత చెల్లింపులను కూడా అదే తరహాలో విడుదల చేయడానికి కేంద్రం మరియు రాష్ట్రం కసరత్తు మొదలుపెట్టాయి.
రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల నిధులు అక్టోబర్ 18న జమ చేయాలని నిర్ణయించారు. దీపావళి వేళ నిధులు అందేలా షెడ్యూల్ రూపొందించారు. కేంద్రం రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 చొప్పున విడుదల చేయనున్నారు. ఈ మొత్తాలు మూడు విడతల్లో రైతులకు చేరేలా ప్రణాళిక సిద్ధమైంది.
కౌలు రైతులకు పీఎం కిసాన్ వర్తించకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం వారికీ ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రెండు విడతల్లో రూ.20,000 చెల్లించనుంది. మొదటి విడతగా అక్టోబర్‌లోనే రూ.10,000 జమ చేస్తారని వ్యవసాయ శాఖ తెలిపింది.
ఇప్పటివరకు సుమారు 46.64 లక్షల మంది రైతు కుటుంబాలను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. భూ వివరాలను వెబ్‌ల్యాండ్ నుంచి సేకరించి, గ్రామ స్థాయిలో ధృవీకరించారు.
అర్హులైన రైతులు తమ పేరు జాబితాలో ఉందో లేదో అన్నదాత సుఖీభవ పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. భూమిలేని కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డు పొంది, ఈ-క్రాప్‌లో నమోదు చేసుకుంటే లబ్ధి పొందగలరు. ఇంకా అర్హులైనవారు ఉంటే, వారు గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేసి సాయం పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.