Ap Grama Ward Sachivalayam: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యతలు – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

WhatsApp Group Join Now

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి కొత్త బాధ్యతల కేటాయింపు – Ap Grama Ward Sachivalayam

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి కొత్త బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పీ-4 (P-4) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమం పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకుని, సమాజంలో సంపన్న వర్గాలు పేద కుటుంబాలను దత్తత తీసుకుని, వారి అభ్యున్నతికి కృషి చేయాలని ప్రోత్సహిస్తుంది. ఇందులో దత్తత తీసుకునే వారిని మార్గదర్శులు, దత్తత పొందిన కుటుంబాలను బంగారు కుటుంబాలుగా పిలుస్తున్నారు.

ఇక, ఈ పీ-4 కార్యక్రమం సమన్వయం బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. ప్రతి సచివాలయ ఉద్యోగికి మూడు క్లస్టర్లు కేటాయించనున్నారు. ఆయా క్లస్టర్లలో ఉన్న మార్గదర్శులు మరియు బంగారు కుటుంబాలతో సమన్వయం చేసి, కార్యక్రమం విజయవంతంగా అమలు కావడానికి సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఈ సమన్వయ పనిని మరింత సులభం చేసేందుకు ప్రత్యేక యాప్‌ను కూడా త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.

Pravasandhra Bharosa
Pravasandhra Bharosa: రూ 10 లక్షల భీమా, ఏపీ ప్రభుత్వం మరో పథకం- అర్హతలు..!!

అయితే, ఈ కొత్త బాధ్యతలపై కొంతమంది సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించగా, ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ నిలిపివేయబడింది. ఇప్పుడు క్లస్టర్ల సమన్వయం బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించడం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వాలంటీర్లకు ఒక్కొక్కరికి 50 ఇళ్ల బాధ్యత కేటాయించినట్టు, ఇప్పుడు ఉద్యోగులకు మూడు క్లస్టర్లను కేటాయించడం వల్ల అదనపు పనిభారం పెరిగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

కొన్నిచోట్ల సచివాలయ సిబ్బంది ఇప్పటికే నిరసనలు కూడా చేపట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, పీ-4 సమన్వయం, వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం వంటి పలు పనులను వరుసగా అప్పగించడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పీ-4 కార్యక్రమం పేదరిక నిర్మూలనకు కీలక అడుగని స్పష్టంగా చెబుతూ, ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాల్సిందిగా ఉద్యోగులను ఆహ్వానించింది.

AP 10th Public Exams 2026
AP 10th Public Exams 2026: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు – ఫీజు చెల్లింపులపై తాజా అప్డేట్

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

WhatsApp Group Join Now
error: Content is protected !!
WhatsApp