ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ – కుల ధ్రువీకరణ పత్రం ఇంటికే | AP Caste Certificate 2025
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇకపై కుల ధ్రువీకరణ పత్రం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వచ్చే అక్టోబర్ 2 నుంచి ఈ పత్రాన్ని నేరుగా ఇంటికే పంపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది.
ప్రస్తుతం ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తున్నారు. ఈ సర్వేలో ఆధార్, రైస్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, పాత కుల ధ్రువీకరణ పత్రం వంటి వివరాలను పరిశీలిస్తున్నారు. అర్హులైన వారికి పత్రాలు సులభంగా అందేలా రెవెన్యూ శాఖ కృషి చేస్తోంది.
కొద్ది రోజులుగా చాలా మందికి మొబైల్ ఫోన్లలో “మీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ దరఖాస్తు అందింది, 25 రోజుల్లో ప్రాసెస్ పూర్తవుతుంది” అనే మెసేజ్‌లు వస్తున్నాయి. కానీ దరఖాస్తు చేయకపోయినా ఆ మెసేజ్ రావడంతో కొందరు ఆశ్చర్యపోయారు. తరువాత అసలు విషయం ఏంటంటే, ప్రభుత్వం సర్వే ఆధారంగా సుమోటో విచారణ జరిపి అర్హులను తేలుస్తోంది.
ఇకపై విద్య, ఉపకార వేతనాలు, ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కోసం ఉపయోగపడే ఈ కుల ధ్రువీకరణ పత్రం నేరుగా ఇంటికే అందుతుంది. గతంలో లాగా సచివాలయం, రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. ఈ సర్వేను ఈ నెల 15లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. వీఆర్వో నుంచి వివరాలు ఆర్ఐ, తహసీల్దార్ కార్యాలయం, ఆ తర్వాత వెబ్‌ల్యాండ్‌లో నమోదు అవుతాయి. కొన్ని దరఖాస్తులు ఆర్డీవో, జేసీల పరిశీలనకు కూడా వెళ్తాయి.
చివరగా అర్హుల జాబితాను రెవెన్యూ వెబ్సైట్లో ఉంచి, అవసరమైనప్పుడు ప్రజలు సులభంగా పత్రాలు పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.