Jio Offers 2025: జియో యూజర్లకు ఫ్రీ అన్‌లిమిటెడ్ డేటా & బంపర్ ఆఫర్లు
రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య 50 కోట్లను దాటింది. ఈ సందర్భంగా సంస్థ తన 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. సెప్టెంబర్ 5 నుంచి మూడు రోజుల పాటు 5జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న యూజర్లందరికీ ఉచితంగా అన్‌లిమిటెడ్ 5జీ డేటా అందిస్తామని జియో తెలిపింది. ఈ ఆఫర్ ప్లాన్‌తో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. 4జీ యూజర్లకు కూడా ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది.
వార్షికోత్సవ ఆఫర్లలో భాగంగా, సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు 5జీ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. 4జీ యూజర్లు రూ.39 రీఛార్జ్ చేసుకుంటే, వారాంతం మొత్తం రోజుకు గరిష్టంగా 3జీబీ హైస్పీడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత వేగం తగ్గుతుంది.
అలాగే రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు అదనంగా అన్‌లిమిటెడ్ 5జీ డేటా అందుతుంది. అదనంగా జియో హోమ్ సేవలకు రెండు నెలల ఉచిత ట్రయల్ కూడా లభిస్తుంది. రూ.349 ప్లాన్‌ను వరుసగా 12 నెలలు రీఛార్జ్ చేస్తే, మరో నెల ఫ్రీ సర్వీసులను అందిస్తామని జియో ప్రకటించింది.
జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ, “50 కోట్ల మంది యూజర్లు తమపై చూపిన విశ్వాసం మాకు గర్వకారణం. జియో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్య భాగమైందని ఈ మైలురాయి నిరూపిస్తోంది. ప్రతి వినియోగదారుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.